9 April, 2026 | 7:34 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు

09-04-2026 05:54 PM

హనుమకొండ,(విజయక్రాంతి): భవాని నగర్ కాలనీలో గురువారం ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరం లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు కార్యక్రమం బిజెపి 59వ డివిజన్ అధ్యక్షుడు జితేందర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది కాలనీ వాసులు పాల్గొని ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకుని అవసరమైన మందులు పొందారు.

ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్  కార్డు నమోదు నిర్వహించగా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజల ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతున్నదని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.