ఓటు హక్కు వినియోగించుకున్న సిఎం రేవంత్ దంపతులు
13-05-2024 11:51 AM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుబం సభ్యులతో కలిసి కొడంగల్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, సినీ నటులు చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు ఓటు వేసిన ప్రముఖుల్లో ఉన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బిజెపి పార్టీ అభ్యర్థి కె మాధవి లత సికింద్రాబాద్ లోని మహేంద్ర హిల్స్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.




