9 April, 2026 | 7:42 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి

09-04-2026 05:56 PM

పౌర సంఘాల బాధ్యులు, మేధావులు, నాయకుల డిమాండ్

హనుమకొండ టౌన్, ఏప్రిల్ 09 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో విలీనం చేసి ఈ మహా నగరాన్ని రెండవ అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దాలని పౌర సంఘాలు, మేధావులు, నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం  హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో పౌర సంఘాలు మేధావులు నాయకులు  నిర్వహించిన సదస్సుకు విశ్రాంత ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షత వహిస్తూ మహానగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేయకూడదు అన్నారు.

అనంతరం వక్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధిస్తే రాష్ట్ర రాజధానితో పాటు ఉమ్మడి జిల్లాల కేంద్రాలు అభివృద్ధి చోదక కేంద్రాలుగా ఎదుగుతాయని ఆశించిన, రాష్ట్ర ప్రజలకు తీవ్ర నిరాశే మిగిలిందని గత 40 సంవత్సరాల నుండి తెలంగాణ అభివృద్ధి అంటే కేవలం హైదరాబాదు నగరం అభివృద్ధిగానే కొనసాగుతున్నదని, అన్ని జిల్లాలతో కలిసి మూడు కోట్ల ఆరవై లక్షల ప్రజల అభివృద్ధి కావాలని కోరారు. ముఖ్యంగా హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా ఎదుగుతున్న వరంగల్ నగరాన్ని ముక్కలు చేసి, నగరం భూములను, పార్కులను కబ్జా చేసి, జైలును కూలగొట్టి భూములు మహారాష్ట్ర బ్యాంకుకు తాకట్టు పెట్టి నగరం అభివృద్ధిని విచ్ఛిన్నం చేశారని, ప్రస్తుత ప్రభుత్వం కూడా రెండు జిల్లాలను కలపడంలోను, వరంగల్ మహానగర పునర్నిర్మాణం చేయడంలో తత్సారం చేస్తుందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని కొత్త జిల్లాలు రాష్ట్ర అనేక జిల్లాల కంటే వెనుకబడి ఉన్నాయని, ముఖ్యంగా హనుమకొండ జిల్లా దయనీయంగా చివరగా 33వ స్థానంలో ఉన్నదని ఫోరం ఫర్ బెటర్ వరంగల్ చైర్మన్ కొండూరు సుధాకర్ ప్రభుత్వ గణాంకాలతో వివరించారు. వరంగల్ మాజీ మేయర్, మాజీ శాసనసభ్యులు డాక్టర్ టి. రాజేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యమ ఫలితంగా ఈ రెండు జిల్లాలను వరంగల్ జిల్లాగా ప్రకటించడానికి సిద్ధపడ్డ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను ఆక్షేపిస్తూ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం చేసిన ప్రకటన అడ్డు పుల్లగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఇతర జిల్లాల ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే 1400 సంవత్సరాల చారిత్రిక నేపథ్యం గల వరంగల్ నగర ప్రజల ఆకాంక్షను ఇంకెంతో కాలం నిర్లక్ష్యం చేయకూడదన్నారు.

వరంగల్ ఈస్ట్ చుట్టూ ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, అభివృద్ధికి అవసరమైన జంక్షన్ లను నిర్మాణం చేసి మౌలిక  వసతులతో పారిశ్రామిక అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు చుక్కయ్య మాట్లాడుతూ వరంగల్ మహా నగర అభివృద్ధిని అడ్డుకున్నారని అనేక పోరాటాలకు పురిటిగడ్డ అయినా వరంగల్ నగర ప్రజల ఐక్యతను, రాజకీయ చైతన్యాన్ని ఓర్వలేకనే నగరాన్ని విభజించడం జరిగిందన్నారు. ప్రముఖ జర్నలిస్టు దాసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా మంత్రులు పార్లమెంటు సభ్యులు ఐక్యతతో ప్రభుత్వాన్ని ఒప్పించి నగర ఏకీకరణ తో పాటు జిల్లా పునర్నిర్మానాన్ని వేగవంతం చేయాలన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు వెంకటరాజ్యం మాట్లాడుతూ కేవలం పాలకుల కాంట్రాక్టు, వ్యాపారాల కొరకే నగరాన్ని విభజించారని నగర ప్రజలు ఎన్నడూ కోరలేదన్నాడు. ఈ కార్యక్రమంలోప్రొఫెసర్ వీ రవీందర్, టి శ్రీనివాస్, డాక్టర్ విజయలక్ష్మి, వి బాబురావు, ప్రముఖ అడ్వకేట్ చిల్లా రాజేంద్రప్రసాద్, జిలకర శ్రీనివాస్, సోమ రామమూర్తి, సాయినీ నరేందర్, సంఘానీ మల్లేశ్వర్, డా. వీరస్వామి, రాయపురపు సాంబయ్య, సోమిడి శ్రీనివాస్ వనజా పటేల్, సిరిపురం అరుణ, మాదిరెడ్డి మల్లారెడ్డి దార బోయిన సతీష్, డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.