21 July, 2026 | 11:16 AM

40 కిలోల గంజాయి పట్టివేత

21-07-2026 12:00 AM
  1. స్కార్పియో, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం 
  2. వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ ప్రసాద్ 

భద్రాద్రి కొత్తగూడెం జూలై 20 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ  మండల పరిధిలోనీ రంగాపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న 40 కిలోల గంజాయి, స్కార్పియో వాహనం తో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ కిషన్ ఆదేశాల మేరకు సోమవారం తమ సిబ్బందితో కలిసి పాల్వంచ మండల పరిధిలోని రంగాపురం వద్ద వాహనాల తనిఖీ నిర్వహించాము. ఈ క్రమంలో అనుమానాస్పదంగా భద్రాచలం నుంచి పాల్వంచ వైపు వస్తున్న ఒక స్కార్పియో వాహనాలను తనిఖీ చేయగా 27. 50 కేజీల ఎండు గంజాయి లభ్యమైంది.

ఈ గంజాయిని మహారాష్ట్ర రాష్ట్రం,మల్కాన్ గిరి జిల్లాకు తరలిస్తూ విపట్టుబడ్డారు. మరో రెండు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయగా 6.20 కిలోల ఎండు గంజాయి లభ్యమైనది అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంకు చెందిన నూప  రవికిరణ్, తాళ్ల ధనరాజ్ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

మరో వాహనంలో భద్రాచలం చెందిన వేల్పుల భరత్ , ములకలపల్లి మండలానికి చెందిన గద్దల శశాంక్ ల నుంచి 6.30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. రూ 23.60 లక్షల ఉంటుందన్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఖలీల్ అహ్మద్, కానిస్టేబుల్ లో రమేష్ బాబు ,రాజు, ప్రసన్నకుమార్  తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఏదైనా గంజాయి, మత్తు పదార్థాలు సంబంధించిన సమాచారం తెలిసినచో టోల్ ఫ్రీ నెంబర్ 18004252523 సమాచారం ఇవ్వాలన్నారు.