వైద్య ఖర్చులకు ఇద్దరికి ‘మేవా’ చేయూత
బూర్గంపాడు,జూలై20,(విజయక్రాంతి): నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ముస్లిం ఎంపవర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (మేవా) ఆధ్వర్యంలో సోమవారం ఇద్దరు బాధితులకు వైద్య ఖర్చుల కోసం రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు.మండలంలోని సారపాక గ్రామానికి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు యండి మహుముద్దీన్ ఖాన్ కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతుండగా, ఆయనకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
అలాగే కోయగూడెం పంచాయతీకి చెందిన షేక్ యాకుబ్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయనకు కూడా రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్భంగా మేవా ప్రతినిధులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు చేయూతనివ్వడం తమ సంస్థ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా అవసరమైన వారికి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేవా అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫా, ప్రధాన కార్యదర్శి జహీర్ భాషా, సోహెల్ పాషా, సైదుద్దీన్, అక్బర్, అబ్దుల్ సలీం, అజీజ్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.






