21 June, 2026 | 1:09 AM

నేటి నుంచే టీజీ20 లీగ్

21-06-2026 12:00 AM

హైదరాబాద్, జూన్ 20 : తెలంగాణలో యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు హెచ్‌సీఏ నిర్వహిస్తు న్న టీజీ20 లీగ్ ఆదివారం నుంచే ప్రారం భం కాబోతోంది. ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడి యం వేదికగా ఈ టోర్నీ జరగనుంది. జూలై 12 వరకూ జరిగే ఈ లీగ్‌లో హైదరాబాద్ ఈ చాంపియన్స్, మెదక్ ఫా ల్కన్స్, పాలమూరు స్ట్రుకర్స్, వరంగల్ వారియర్స్, రంగా రెడ్డి రైజర్స కరీంనగర్ డైమం డ్స్, అన్విత ఖమ్మం ఏసెస్, నల్గొండ నైట్స్ లీగ్ బరిలో ఉన్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. విజేతగా నిలిచిన జట్టు రూ. కోటి ప్రైజ్‌మనీ దక్కనుంది. కాగా తొలిరోజు ఆరంభవేడుకల్లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్, టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్ విజయ దేవరకొండ సందడి చేయనున్నారు.