21 June, 2026 | 1:37 AM

సైబారీ ఫాస్టెస్ట్ గోల్

21-06-2026 12:00 AM

స్కాట్లాండ్‌పై మొరాకో విజయం

బోస్టన్, జూన్ 20 : ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మొరాకో తొలి విజయాన్ని అందుకుం ది. స్కాట్లాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో మొరాకో 1 గోల్స్ తేడాతో విజ యం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొరాకో మిడ్‌ఫీల్డర్ ఇస్మాయిల్ సైబారీ సంచలనం సృష్టించాడు.

మ్యాచ్ ప్రారంభమైన కేవలం 70 సెకన్లలోనే సైబారీ గోల్ కొట్టాడు. ఈ ప్రపంచకప్‌లో నమోదైన అత్యంత వేగవంతమైన గోల్ ఇదే. ఇంతకుముందు సౌతాఫ్రి కాపై చెకియా దేశానికి చెందిన మిచల్ సాడిలెక్ 5 నిమిషాల 7 సెకన్లలో కొట్టిన గోల్ రికార్డును సైబారీ బద్దలు కొట్టాడు. సైబారీ మెరుపు వేగంతో సా ధించిన ఈ గోల్ హైలైట్‌గా నిలిచింది. తన కెరీర్లో ఆడిన మొదటి రెండు ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లలోనూ వరుసగా గోల్స్ సాధించిన రెండో ఆఫ్రికన్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.