టార్గెట్ క్లీన్‌స్వీప్
నేడు ఆప్గనిస్థాన్‌తో చివరి వన్డే
ఇప్పటికే సిరీస్ గెలిచిన భారత్
తుది జట్టులో మార్పులు
సొంతగడ్డపై టీమిండియా మరో క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. ఆప్గనిస్థాన్‌తో వన్డే సిరీ స్‌ను ఊడ్చేయాలని ఎదురుచూస్తోంది. చెన్నై వేదికగా జరగబోయే చివరి వన్డేలో నూ గెలిచి 3-0తో సిరీస్‌ను స్వీప్ చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు చివరి వన్డేలోనైనా గట్టిపోటీనివ్వాలని ఆప్గన్ టీం భావిస్తోంది. భారత తుది జట్టులో మార్పు లు జరిగే అవకాశాలున్నాయి.
చెన్నై, జూన్ 19 : భారత్, ఆఫ్గనిస్థాన్ మధ్య మూడో వన్డేకు అంతా సిద్ధమైంది. శనివారం చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఏకైక టెస్టుతో పాటు తర్వాత వరుసగా రెండు వన్జేల్లోనూ ఆఫ్గనిస్థాన్ ను చిత్తు చేసిన టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు చివరి మ్యాచ్‌లోనూ గెలిచి వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని ఉత్సాహంగా ఉంది.
ఈ సిరీస్ లో గిల్, ఇషాన్ కిషన్ అదరగొడుతున్నారు. రోహిత్ శర్మ కూడా పర్వాలేదనిపిస్తున్నా పూర్తిస్థాయి మెరుపు లు మాత్రం ఇంకా మెరిపించలేదు. దీంతో చివరి వన్డేలో రోహిత్ శర్మపైనే అందరి చూపు ఉంది. వన్డే ప్ర పంచకప్ జట్టులో చోటు దక్కాలంటే మాత్రం రోహిత్ దాదాపు తాను ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ అదరగొట్టాల్సిందే. ఇదిలా ఉంటే మన బ్యాటింగ్ లైనప్‌లో ప్ర స్తుతం గిల్, ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో వీరిద్దరూ సూపర్ సెంచరీలతో దుమ్మురేపారు.
వీరి విధ్వంసం కారణంగానే భార త్ 400 ప్లస్ స్కోరు సాధించింది. మరోసారి గిల్, ఇషాన్ చెలరేగితే ఆఫ్గన్ బౌలర్లకు చుక్కలే. మిగిలిన బ్యాటర్లలో జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ పై అంచనాలున్నా యి. మరోవైపు బౌలింగ్‌లో కూడా భారత్ అదరగొడుతోంది. అరం గేట్రంలోనే గుర్నూ ర్ బ్రార్, ప్రిన్స్ యాద వ్ ఆకట్టుకున్నారు. బుమ్రా లేకపోవడం తో పేస్ భారాన్ని మోస్తున్న అర్షదీప్‌తో పాటు యువ పేసర్లు సత్తా చాటుతున్నారు. కాగా చివరి వన్డేకు హ ర్షిత్ రాణా కూడా జట్టు తో చేరడంతో తుది జట్టు లో మార్పులు జరిగే అవకాశముంది. రెండో వన్డేలో హర్ష దూబేకు రెస్ట్ ఇచ్చి, కుల్దీప్‌ను ఆడించారు. అలాగే నితీశ్ రెడ్డి, ప్రసిద్ధ కృష్ణ స్థా నాల్లో జైస్వాల్, ప్రిన్స్ యాదవ్ ఆడారు.
ఇప్పుడు చివరి వన్డేకు నితీశ్ రెడ్డి, ప్రసిద్ధ కృష్ణ రానుండగా.. కుల్దీప్‌ను కొనసాగిస్తారా లేదా అనేది చూడాలి. మరోవైపు ఆఫ్గనిస్థాన్ చివరి మ్యాచ్‌లో గట్టిపోటీనివ్వాలని పట్టుదలగా ఉంది. బ్యాటింగ్‌లో గుర్బాజ్ తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమవుతున్నారు. అటు బౌలింగ్‌లోనూ ఆఫ్గన్ పరిస్థితి అంతం త మాత్రంగానే ఉంది. ఆఫ్గన్ ఎంత గట్టిపోటీ ఇచ్చినా క్లీన్ స్వీప్‌ను తప్పించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక పిచ్ విషయానికొస్తే చెపాక్ స్టేడియం సాధారణంగా మొదటి బ్యాటింగ్ జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఇటీవల ఇక్కడ జరిగిన మ్యాచ్‌లలో ఛేజింగ్ జట్లే విజయాలు సాధించాయి.
తుది జట్ల అంచనా
భారత్ : గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషా న్, శ్రేయాస్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్, నితీష్ రెడ్డి, హర్ష దూబే, హర్షిత్ రాణా, గు ర్నూర్ బ్రార్, అర్షదీప్ సింగ్
ఆఫ్గనిస్థాన్ : గుర్బాజ్, జడ్రాన్, సెదిక్, రహమత్ షా, హస్మతుల్లా (కెప్టెన్), ఒమర్జాయ్, నబీ, రషీద్ ఖాన్, ఘజన్, రహ మాన్, సలీమ్






