calender_icon.png 7 December, 2025 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్ బాలికపై లైంగిక దాడి.. వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష

07-12-2025 11:49:45 AM

థానే: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి థానే కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2021లో 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడాడు. దీంతో ఆ బాలిక గర్భవతి అయ్యింది. ఈ నేరం హేయమైనదిగా థానే కోర్టు బావిస్తూ, కఠినంగా వ్యవహరించాలని, వ్యక్తికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. 2021 మే నెలలో కాశీమిరా ప్రాంతంలోని బాదితురాలి పొరుగు ప్రాంతంలో సాహిద్ మొహమ్మద్ రంజాన్ హస్మి అనే వ్యక్తి నివసముండే వాడు. బాదితురాలిని నిందితుడు తనను ఇంటి దగ్గర దింపుతానని మాయమాటలు చెప్పి, ఆ తర్వాత తన ఇంటికి తీసుకేళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ నేరం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు బాధితురాలిని బెదిరించాడు. ఆ బాలికకు జూలై 2021లో తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వైద్య పరీక్ష చేయించగా ఆమె గర్భవతి అని తేలింది. ఆమె మొదట ఈ సంఘటన గురించి మరొక వ్యక్తికి తెలియజేసింది. తరువాత, తల్లి ఆమెను నిలదీయగా నిందితుడు చేసిన నేరం గురించి చెప్పింది. దీంతో స్థానిక పోలీసు స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంజయ్ లోండ్గే కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, నిందితుడు చేసిన చర్య హేయమైనదని న్యాయమూర్తి భావించారు. అంతేకాకుండా బాధితురాలిపై నిందితుడు రెండుసార్లు తీవ్రమైన లైంగిక దాడికి పాల్పడ్డాడని, దాని కారణంగా ఆమె గర్భవతి అయిందని, ఆమెను బెదిరించాడని ప్రాసిక్యూషన్ నిరూపించిందని కోర్టు పేర్కొంది.

ఆర్థిక వివాదం కారణంగా కేసు తప్పుడుదని ప్రతివాదుల వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. బాధితురాలు, ఆమె తల్లి ఇచ్చిన మౌఖిక సాక్ష్యం స్పష్టమైన డాక్యుమెంటరీ సాక్ష్యం - డీఎన్ఏ నివేదిక - రికార్డులో ఉన్నందున, నిందితుడు తీసుకున్న ఈ రక్షణ ఆమోదయోగ్యం కాదని న్యాయమూర్తి అన్నారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం సెక్షన్ 5 కింద నిందితుడు సాహిద్ మొహమ్మద్ రంజాన్ హస్మిని కోర్టు దోషిగా నిర్ధారించి, అతనికి రూ. 50,000 జరిమానా కూడా విధించింది.

అందుకు సంబంధించిన ఆర్డర్ కాపీ ఆదివారం అందింది. నేరం శిక్ష గురించి న్యాయమూర్తి మాట్లాడుతూ... "పిల్లలపై లైంగిక వేధింపుల చర్యను తీవ్రంగా పరిగణించాలని, అలాంటి నేరాలను కఠినంగా ఎదుర్కోవాలని పేర్కొన్నారు. రెండు వైపుల వాదనలను పరిగణనలోకి తీసుకుని నిందితుడు క్షమాభిక్షకు అర్హులు కాడని కోర్టు స్పష్టం చేసింది. జరిమానా మొత్తాన్ని వసూలు చేసి బాధితురాలికి పరిహారం చెల్లించాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA)కి కేసును సిఫార్సు చేశారు.