షిమ్లా.. వహ్వా!
11-12-2024 02:35 AM
క్వీన్ ఆఫ్ హిల్స్‌గా షిమ్లాకు అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. నేటి హిమాచల్‌ప్రదేశ్‌లో భాగమైన ఈ పట్టణం ఒకప్పుడు నేపాలీల రాజ్యంలో ‘శ్యామల’ పేరుతో వర్ధిల్లింది. పేరుకు తగ్గట్టుగానే ఇప్పుడా ప్రాంతం ‘శ్వేత’శ్యామలమైంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోవడంతో చలి పంజా విసురుతోంది. తెల్లని మంచు కురుస్తున్నది. చుట్టూ మంచుకొండలు, ప్రకృతి రమణీయత మధ్య ‘షిమ్లా.. వహ్వా’ అన్నట్లుంది కదా.. ఈ దృశ్యం !






