16 July, 2026 | 2:54 PM

ఇండో అమెరికన్‌కు కీలక పదవి

11-12-2024 02:26 AM

* పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్‌గా హర్మీత్

వాషింగ్టన్, డిసెంబర్ 10:   అమెరికా  కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గంలో మరో ఇండో అమెరికన్‌కు కీలక పదవి అప్పగించారు.  భారత సంతతికి చెందిని హర్మీత్ కే థిల్లాన్‌ను అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌లో పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్‌గా నియమించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ వెల్లడించారు. భారత్‌లోని చండీగఢ్‌లో జన్మించారు. ఆమె చిన్నతనంలోనే ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడింది. వర్జీనియా యూనివర్సిటీలో లాను పూర్తి చేసి 2003 వరకు ఒరిక్, హెరంగ్టన్‌లలో లాయర్‌గా పనిచేశారు. తరువాత థిల్లాన్ లా గ్రూప్ ఇంక్ సంస్థను స్థాపించారు.