26 July, 2026 | 6:14 AM

పొక్సో కేసులో 20 ఏండ్ల జైలు

26-11-2024 04:28 AM

ఎల్బీనగర్, నవంబర్ 25: మైనర్‌పై లైంగికదాడికి యత్నించిన కేసులో నిందితుడికి కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేశ్ తెలిపిన వివరాలు.. రంగారెడ్డి జిల్లా యాచారం మం డలం గడ్డమల్లయ్యగూడకు చెందిన మహేశ్(25).. మైనర్‌ను ప్రేమ పేరుతో వేధించి  లైంగికదాడికి యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు యాచారం పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, పూర్తి ఆధారాలు కోర్టులో సమర్పించారు. కేసును విచారించిన ఎల్బీనగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు  మహేశ్‌కు 20ఏండ్ల జైలుశిక్షతోపాటు రూ.25వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం అందించారు.