calender_icon.png 13 September, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్‌

13-09-2025 09:15:13 AM

 రూ. 43 లక్షల విలువ గల 86 కిలోల గంజాయి  పట్టి వేత   

 అయిదుగురు  అరెస్ట్, ముగ్గురు పరారీలో 

అరెస్ట్ అయినవారిలో  NDRF కానిస్టేబుల్   

అశ్వారావుపేట,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని  దమ్మపేట మండలంలో  అంతర్ రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేసినట్టు పాల్వంచ డి ఎస్ పి సతీష్ తెలిపారు. శుక్రవారం సాయంకాలం దమ్మపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో ఆయన వివరాలను వెల్లడించారు.దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్వారిగూడెం గ్రామ శివారులో అశ్వరావుపేట  సర్కిల్ ఇన్స్పెక్టర్, పింగిలి నాగరాజు సూచనల తో ఎస్ ఐ సాయి కిషోర్ రెడ్డి , టాస్క్ ఫోర్స్ , సిబ్బంది ఆధ్వర్యంలో  శుక్రవారం ఉదయం వాహన తనిఖి చేస్తుండగా, అనుమానాస్పదంగా  ఓ వాహనం పాల్వంచ వైపు  నుండి దమ్మపేట వైపు  కు  పారిపోవాటాన్ని గమనించి ,వాహనం వెంబడించారు.

ఎట్టకేలకు వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న విషయం బయట పడింది.టయోటా ఇన్నోవా కారుకు ఫేక్ నెంబర్ ప్లేట్ : TS 11 EA 1724 ను ఏర్పాటు గంజాయి రవాణా చేస్తున్నట్టు డి ఎస్ పి తెలిపారు. వాహనం అసలు నెంబర్ ప్లేట్ PB10 DU 0831 నీ ఆయన తెలిపారు.పోలీసు తనిఖీ లలో  మొత్తం 4 బస్తాలలో 40 గంజాయి పాకెట్ల ,ఒక్కొక్కటి సుమారు 2 కిలోల బరువు ఉన్నాయని,   మొత్తం  85.5 కేజిలు అని తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారుగా రూ.42,77,000 లు ఉంటుందని డి ఎస్ పి తెలిపారు. CISF కానిస్టేబుల్  పన గుడ  శివకృష్ణ, జయరామన్ మహేష్ కుమార్,  కృష్ణమూర్తి మారియప్పన్, కందసామి రంజిత్, రాము వసంత్,  తమిళనాడు కు చెందిన ఐదుగురు దొరకగా, ముగ్గురు నిడుతులు పరారీలో ఉన్నారని ఆయన తెలిపారు. ఒరిస్సా కు చెందిన సిబో, రాజమండ్రి కి చెందిన స్వాతి  అలియాస్ దేవి, తమిళనాడు కు చెందిన షణ్ముఖం పరారీ లో ఉన్నారని తెలిపారు. దమ్మపేట ఎస్ ఐ సాయి కిషోర్ రెడ్డి, , టాస్క్ ఫోర్స్ అధికారులు లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా ను పట్టుకున్న ఎస్ ఐ, సిబ్బంది నీ జిల్లా ఎస్ పి రోహిత్ రాజ్, డి ఎస్ పి అభినందించారు.