calender_icon.png 13 September, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే స్టేషన్ లో మెరుగైన సదుపాయాల కల్పనకు చర్యలు

13-09-2025 12:31:36 PM

రైల్వే జీఎం 

కాగజ్ నగర్,(విజయక్రాంతి): పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్ నగర్ రైల్వే స్టేషన్(Kagaznagar Railway Station)లో ప్రయాణికులకు మెరుగైన ఆధునిక సేవల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం జి.ఎం ఎస్ కే శ్రీవాత్సవ స్పష్టం చేశారు. శనివారం కాగజ్ నగర్(Kagaznagar ) రైల్వే స్టేషన్ ను ఆయన సందర్శించారు. రైల్వే స్టేషన్ లోని ప్లాట్ ఫామ్, టికెట్ కౌంటర్, ఇతర వాటిని ఆయన పరిశీలించారు. సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు, వ్యాపారులు, రైలు యాత్ర సేవాసమితి సభ్యులు జీఎంను కలిసి వివిధ సమస్యలను వివరించారు. ఫ్లాట్ ఫామ్ నెం.3ను అభివృద్ధి చేయాలని, టికెట్ కౌంటర్ ఏర్పాటుచేసి, మరుగుదొడ్ల సదుపాయం , నూతన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించి ,3 ఫ్లాట్ ఫామ్లకు 3 లిఫ్ట్ లు ఏర్పాటు చేయాలని పలువురు జిఎంను కోరారు.

కేరళ ఎక్స్ప్రెస్ కు కాగజ్ నగర్ లో హాల్టింగ్ ఇవ్వాలని, అలాగే చర్లపల్లి నుండి హౌరా వరకు సిర్పూర్ కాగజ్నగర్ మీదుగా కొత్త రైలు నడపాలని, తద్వారా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న బెంగాలీలకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుందని జయం దృష్టికి తెచ్చారు. సానుకూలంగా స్పందించిన జనరల్ మేనేజర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ .20 కోట్లు కేటాయిస్తున్నామని, రైల్వే స్టేషన్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం, రైల్ సేవా సమితి అధ్యక్షులు ప్రయాగ్ తివారి, మండల అధ్యక్షులు కుంచాల విజయ్, మాజీ కౌన్సిలర్లు దెబ్బటి శ్రీనివాస్, అరుణ్ లోయ, పవన్ బల్దేవ, సంతోష్, అనిల్, రైల్వే అధికారులు పాల్గొన్నవారు.