13-09-2025 11:59:09 AM
గచ్చిబౌలి,(విజయక్రాంతి): మాదాపూర్‌లో అగ్నిప్రమాదం(Fire accident) చోటుచేసుకుంది. తెల్లవారుజామున అయ్యప్ప సొసైటీలోని(Ayyappa Society) ఓ బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మాదాపూర్ లోని క్యామెల్ క్యూ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కంపెనీలో తెల్లవారుజాము 3 గంటల సమయంలో మంటలు రావడంతో గుర్తించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదంలో భవనంలోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది, అదృష్టవశాత్తూ ప్రాణనష్టం ఏదీ జరగలేదు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.