calender_icon.png 23 November, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేక్షకులను అలరించిన నాట్యతోరణం

18-11-2025 12:44:52 AM

-ఐదురకాల నృత్యరీతులు.. జుగల్‌బందీ 

-కరతాళ ధ్వనులతో నిండిపోయిన శిల్పకళావేదిక

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 17 (విజయక్రాంతి): గత ఐదు సంవత్సరాలుగా అమృత కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నృత్యపండుగ.. హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో ఆదివారం నగరవాసుల ను అలరించింది. రెండున్నర గంటల పాటు భరతనాట్యం, కూచిపూడి, కథక్, మోహినీఅట్టం, ఒడిస్సీ, జుగల్బందీ రీతుల ను పలు వురు నర్తకులు, నర్తకీమణులు ప్రదర్శించా రు. 40 మందికి పైగా నాట్యకారులంతా అత్యంత  హృద్యమైన రీతుల్లో నాట్యభంగిమలు చూపించారు.

అమృత కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రాజేష్ పగడాల మాట్లాడుతూ..‘అశేష ప్రేక్షకాదరణ వల్లే మేం నాట్యతోరణం కార్యక్రమాన్ని ఇన్నేళ్లుగా హైదరా బాద్‌లో నిర్వహించగలుగుతున్నాం. ఇది మాకు మరో మైలురాయి’ అన్నారు. అమృత కల్చరల్ ట్రస్ట్ ట్రస్టీ భార్గవి పగడాల మాట్లాడుతూ.. ‘ఈ ఐదేళ్లలో మేం 700 మందికి పైగా యువ నృత్యకారులు, ఏడు రకాల నృత్యరీతులకు అవకాశం కల్పించాం. ప్రతియేటా 50కి పైగా నృత్య పాఠశాలలు, 25 మందికి పైగా విశిష్ట గురువులు మా వేదికను, మా లక్ష్యాన్ని నమ్ముతున్నారు’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చంద్రశేఖర్, అదనపు డీజీపీ అనిల్ కుమార్, ఆచార్య కళా కృష్ణ, సంగీత నాటక అకాడమీ అవా ర్డు విజేత దీపికారెడ్డి, మైహోం గ్రూప్ వైస్ చైర్మ న్ జూపల్లి జగపతిరావు, సాయి సిలక్స్ కళామందిర్ వ్యవస్థాపకుడు, ఎండీ చలవా ది ప్రసాద్, కేఫ్ నీలోఫర్ ఛైర్మన్ అనుముల బాబూరావు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ ఉషారామన్, పీఆర్ డిజైన్ హౌస్ సీఎండీ పార్వతిరెడ్డి పాల్గొన్నారు.