calender_icon.png 18 November, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి

18-11-2025 12:44:09 AM

మహబూబాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): రైతులు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధర అమలులో స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతాంగం ఆరుగాలం కష్టపడి, అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పంటలు పండిస్తే మద్దతు ధర లేక నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

పంటల సాగు సమయంలో ప్రకృతి వైపరీత్యాలు, ఎరువుల కొరత, ఇప్పుడు తుఫాను కారణంగా ఆశించిన దిగుబడి లేక పండిన కొద్దిపాటి పంటను తక్కువ ధరకు విక్రయించి నష్టాల పాలు కావలసిన పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం స్పందించి వెంటనే పండించిన పంటలకు మద్దతు ధర అందించాలని, సాగులో కష్టనష్టాలు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి ఐలయ్య, ప్రధాన కార్యదర్శి గుజ్జు దేవేందర్, బుర్కా వెంకటయ్య, సక్రు, లింగన్న, యాకన్న, నరసింహ, వెంకన్న, భిక్షం, మురళి తదితరులు పాల్గొన్నారు.