23 March, 2026 | 10:40 PM

వాలిడిషన్ యాక్ట్ రద్దు కోసం 25న నిరసన

23-03-2026 05:47 PM

నిర్మల్,(విజయక్రాంతి): దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వాలిడేషన్ యాక్ట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న అన్ని జిల్లాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ పెన్షనర్ల కార్యవర్గ సభ్యుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంసి లింగన్న తెలిపారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈనెల 25న అన్ని జిల్లాల్లో పెన్షనర్లు నిరసన పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నల్లబెడ్లు ధరించి నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణ చేసినటువంటి వాలిడేషన్ యాక్ట్ దేశంలోని రాష్ట్ర, కేంద్ర పెన్షనర్ల అస్తిత్వానికి ముప్పు పొంచి ఉందన్నారు. గొడ్డలి పెట్టు చర్య, ఇట్టి చర్య వలన దేశంలోని దాదాపు 92 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అదేవిధంగా లక్షలాదిమంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఈ ఆక్ట్ ద్వారం నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర  సంయుక్త  కార్యదర్శి గొజ్జ జనార్ధన్, జిల్లా ఆర్థిక కార్యదర్శి ఎల్.గంగన్న, జిల్లా కార్యదర్శి మోహన్ రెడ్డి యూనిట్ బాధ్యులు కే రమేష్ పి జనార్ధన్ కే బాలకృష్ణ కే శేషాద్రి కమలాకర్ జిల్లా బాధ్యులు కే పోశెట్టి తదితరులు కోరడం జరిగినది.