13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

నత్త నడకన ముత్యంపేట రోడ్డు పనులు

23-03-2026 09:38 PM

దోమకొండ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో సోమవారం మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముత్యంపేట్ రోడ్డు నిర్మాణంలో జాప్యం గురించి తహసీల్దార్ కి మెమోరాండం ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ రూ.25 కోట్లతో R&B శాఖ ద్వారా నర్సన్నపల్లి, క్యాసంపల్లి, రాఘవపూర్, ముత్యంపేట్ మీదుగా దోమకొండ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం మంజూరు చేయించారు. అట్టి పనిని ప్రారంభించి 3 సంవత్సరాలు గడిచిపోయింది.

పనులు నత్త నడకన సాగుతున్నాయి అని ఇందులో భాగంగా ముత్యంపేట్ నుండి దోమకొండ వరకు కంకర రోడ్డు వేసినారు. కంకరపై నీరు పట్టక కంకర లేచిపోయి రాక, పోకలకు ఇబ్బంది కలుగుతు ప్రమాదకరంగా మారింది. ప్రయాణికులు కంకర ఉండటంతో వారి వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు సంభవిస్తున్నాయి క్రింద పడిపోతున్నారు. కావున ఇట్టి పనిని R&B శాఖ చొరవ తీసుకొని తక్షణమే పనులు పునఃప్రారంభించి, BT రోడ్డు పూర్తి చేయవలసిందిగా  కోరుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.