13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

జీతాల కోసం కుటుంబంతో వాటర్ మెన్ ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి

23-03-2026 09:53 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని గోసాయిపల్లి గ్రామ వాటర్ మెన్ బాలయ్య సోమవారం తన కుటుంబంతో కలిసి ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. గ్రామ వాటర్ మెన్ బాలయ్యకు గత నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదని, దానికి కారణం సర్పంచ్ రాజకీయ వివక్ష చూపుతూ తమను పస్తులుంచుతున్నారని, వెంటనే వేతనం చెల్లించకపోతే కుటుంబంతో సహా కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎంపీఓ శారద దేవి, బ్రహ్మయ్య, బాధితుడు బాలయ్యకు త్వరలోనే వేతనం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.