13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఎన్నికల హామీలను అమలు చేయాలి

23-03-2026 09:43 PM

ఆంక్షలు లేని జీవన భృతి కల్పించాలి

నిర్మల్,(విజయక్రాంతి): బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు ఆంక్షలు లేని జీవన భృతి కల్పించాలని ప్రగతిశీల బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు సోమవారం నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా జీవన భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం రోజున తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టియుసిఐ ఆధ్వర్యంలో జిల్లా పాలన అధికారి కార్యాలయం ముందు ధర్నా చేసి కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం అయినది.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.రాజన్న మాట్లాడుతూ... వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తున్న బీడీ పరిశ్రమ రోజు రోజు క్షీణించి నిర్వీర్య స్థాయికి దిగజారుతుంది. బీడీ పరిశ్రమలో నెలకు 8, 10 రోజుల పని కల్పిస్తున్నారు. రోజు పని దొరకడం లేదన్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎం.బక్కన్న, ఆర్ రామ లక్ష్మణ్, ఎస్.గంగన్న, కె.లక్ష్మి, ఎస్.లక్ష్మి, ఫెరోజ్, గంగాధర్, గంగామణి, నారాయణ, సుశీల, గోదావరి, తదితరులు పాల్గొన్నారు.