17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

జీనియస్ కంపెనీ అక్రమాలకు అధికార పార్టీ అండదండలు

15-04-2026 12:00 AM

రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నాయకులు

అబ్దుల్లాపూర్ మెట్, ఏప్రిల్ 13: జీనియస్ కంపెనీ అక్రమాలకు అధికార పార్టీ అండదండలు ఉన్నాయని అఖిలపక్ష నాయకులు అన్నారు. జీనియస్ రియల్ ఎస్టేట్ విల్లాస్ వ్యాపారస్తులు అనాజ్ పూర్ గ్రామంలో వేముల కత్వ, ఇందిరా సాగర్, అక్రమ కబ్జా నుంచి రక్షించాలని సిపిఎం పార్టీ  అబ్దుల్లాపూర్ మెట్ మండల కమిటీ ఆధ్వర్యంలో  సోమవారం అనాజ్ పూర్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి వర్కల బాలరాజు అధ్యక్షతన వహించారు. సీపీఎం నుంచి ఏర్పుల నరసింహ, సీపీఐ పార్టీ నుంచి ముత్యాల యాదిరెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ నవనీత మహేష్, బీజేపీ నుంచి పాపయ్య, కాంగ్రెస్ నుంచి రాంరెడ్డి పాల్గొని మాట్లాడుతూ...  అధికార పార్టీ అండదండలతో జీనియస్ రియల్ ఎస్టేట్ వ్యాపాస్తులు అక్రమాలకు పాల్పడుతుందని అన్నారు. గతంలో సంబంధిత అధికారులు  వేముల కత్వ, ఇందిరా సాగర్  చెరువులను సర్వే చేసి ఎఫ్ టీఎల్ లో హద్దు రాళ్లు పాతినప్పటికీ ఎఫ్ టీ ఎల్ నుంచి 50 ఫీట్ల లోపల భారీగా రోడ్డు ఇస్తున్నారని అన్నారు. 

జీనియస్ విలాస్ కు రోడ్డు లేదు ప్రభుత్వ భూమిలో నుంచి అక్రమంగా రోడ్డు చేస్తున్నారని... కావున వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి ఎఫ్ టీ ఎల్ లో వేస్తున్న రోడ్డు పనులు నిలుపుదల చేసి.. రోడ్డు నిర్మించడానికి పోసిన మట్టిని, రాళ్ళను, తొలగించాలని అఖిల పక్ష నాయకులు డిమాండ్ చేశారు. లేని ఎడల, ఉద్రిక్తమైన ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

గ్రామ సర్పంచ్ నవనీత మహేష్ మాట్లాడుతూ.. మా సహాయ శక్తుల వాటిని కాపాడడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏర్పుల నరసింహ మాట్లాడుతూ.. ఎంతటి వరరైన వదిలిపెటేదిలేదు వెంచర్ ప్రారంభం నుంచి సీపీ ఎం పార్టీగా వేముల కత్వను ఇందిరా సాగర్, కాపాడాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి,   సీపీఐ మండల కార్యదర్శి హరిసింగ్, బీజేపీ మండల అధ్యక్షులు విష్ణు, సీపీఎం మండల నాయకులు గుండె శివ, వర్కల ముత్యాలు, కావాలి జంగయ్య, బీఆర్‌ఎస్ నాయకులు రాములు, అశోక్, రవి, గ్రామ పంచాయతీ వార్డు  నెంబర్లు, రాంరెడ్డి, యాది రెడ్డి, ఎరుకలి బాలకృష్ణ, కావాలి వెంకటేష్, స్వప్న, భరత్, బీజేపీమండల నాయకులు రమేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.