17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి

17-04-2026 01:38 PM
  1. చేసిన అభివృద్ధి చరిత్రలో మిగులుతుంది
  2.  ప్రతి సమస్యను పరిష్కారం మార్గం చూపిస్తాం 
  3.  డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడుతూ అందరికి సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. 11, 18వ డివిజన్ లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల మహిళలకు అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెస్సార్ మాట్లాడుతూ ఉచిత బస్, 200 యూనిట్స్ ఉచిత విద్యుత్, రేషన్ కార్డ్స్, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్య శ్రీ , వంటి పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు అందిస్తుందన్నారు. ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించాలని గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదేళ్లు పాలించిన ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకపోవడం వెనక ఉన్న అంతర్యమేమిటిని ప్రశ్నించారు.

నిరంతరం రేషన్ కార్డులతో పాటు ప్రశాంతమైన జీవితంలో ప్రజా పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. అందరూ బాగుపడితే అంతకంటే సంతోషం ఏముంటుందన్నారు. అందరి సూచనలు సలహాలు పాటిస్తూ నగరాన్ని మహానగరగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తూ అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎంతో ముందు చూపుతో భవిష్యత్తు బాగుండాలని సంకల్పంతో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గిరి గౌడ్,మధుమోహన్, మున్సిపల్ అసిస్టెంట్  కమిషనర్ రాజన్న గారు,వార్డ్ ప్రెసిడెంట్ చిట్టెమ్మ జ్యోతి,జంగాల విజయ్, జాజి మొగ్గనర్సింహులు,కొయ్యనగర్ రాఘవ యాదవ్,శేఖర్ యాదవ్, రాములు యాదవ్, క్రాంతి, ప్రసాద్, జంగాల మహేష్, మైత్రి యాదయ్య ,వార్డ్ ప్రతినిధులు, మహిళా సంఘాలు,వివిధ పార్టీల నాయకులు, సంఘ నాయకులు ఉన్నారు.