15 April, 2026 | 5:04 PM

కాంగ్రెస్‌లో చేరిన టేకులపల్లి సర్పంచ్, వార్డు సభ్యులు

14-04-2026 01:10 AM

షాద్ నగర్ ,ఏప్రిల్ 13 (విజయక్రాంతి):  బీఆర్‌ఎస్కు గుడ్బై చెబుతూ గ్రామ సర్పంచ్ సహా వార్డు సభ్యులు  కాంగ్రెస్లో  చెసారు. కొందుర్గు మండలానికి చెందిన టేకులపల్లి గ్రామ సర్పంచ్ పత్తి శ్రీశైలం, డిప్యూటీ సర్పంచ్, వార్డు సభ్యులు సోమవారం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరిక  షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలో ఆయన స్వగృహంలో జరిగింది. బీఆర్‌ఎస్ పార్టీకి గుడ్బై చెప్పిన సర్పంచ్ శ్రీశైలం మాట్లాడుతూ& గ్రామ అభివృద్ధి కోసం అధికార పార్టీతో జతకట్టాల్సిన అవసరం ఉందని భావించాం. అందుకే కాంగ్రెస్లో చేరాం అని స్పష్టం చేశారు.

గ్రామ ప్రజల అభ్యున్నతే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కండువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. కాంగ్రెస్ పార్టీ గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉంది అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్పు పెరుగుతున్న నమ్మకంతో అనేక గ్రామాల్లో సర్పంచులు, ప్రజాప్రతినిధులు మా పార్టీలో చేరేందుకు ముందుకొస్తున్నారు. ఇది శుభపరిణామం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, యువ నాయకుడు పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.