కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాసమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలి
మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి
ఘట్‌కేసర్, జూలై 17 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యర్తలు నిత్యం ప్రజలకు వారి అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధి చౌదరిగూడ, సాదత్ అలీగూడ, ప్రతాప్ సింగారం, ముత్వెల్లిగూడ, కాచవాని సింగారం లలో శుక్రవారం డివిజన్ అధ్యక్షుడు కర్రె రాజేష్ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం, సర్ పర్యవేక్షణ కార్యక్రమంలో ప్రతాప్ సింగారంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలలో ఉత్సహాన్ని నింపే విధంగా డివిజన్ లో జెండా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని, కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకువెళ్తూ పార్టీ అభ్యునతికి పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో మంచి ఉన్నత స్థానం ఉంటుందని తెలిపారు. వనులు చేసిన వారికే పార్టీ వదవులు దక్కుతాయని గుర్తు చేశారు.
అంతకు ముందు డివిజన్ అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ పార్టీకి కట్టుబడి పని చేస్తున్నందునే ఈరోజు మూడవ సారి పార్టీ అధ్యక్షుడిగా నియమించారని గుర్తు చేశారు. డివిజన్ వారం రోజుల పాటు ప్రతి గ్రామంలో జెండా కార్యక్రమానికి సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి ఇటికాల కృష్ణరెడ్డి, ఓబిసి సెల్ కోఆర్డినేటర్ పోలగోని శ్రావణ్ కుమార్ గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కే, వినోద్ కుమార్, మాజీ ఉపనర్పంచ్ లు కర్రె అశోక్, అబేదా భేగం, మాజీ ఎంపిటీసిలు పులకంటి భాస్కర్ రెడ్డి, రాయబండి నవీన్, బద్దం కుమార్, భోజిరెడ్డి, ఎర్ర మాధవి, మెట్టు గణేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.






