పక్కాగా భూముల రీసర్వే
-జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
మెదక్, జులై 17 (విజయక్రాంతి): పక్కగా భూముల రీసర్వే చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అల్లదుర్ మండలకేంద్రం లోనీ నిర్వహించిన భూముల రీసర్వే గ్రామ సభ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మా ట్లాడుతూ.. భూ సమస్యలు తలెత్తకుండా, ప్రతి రైతుకు భూ హక్కులు కల్పించేలా భూ మి రీ సర్వే చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అన్నారు. రైతులకు భూ వివాదాలు లేకుండా చేసి, ప్రతి భూ కమతానికి భూధార్ అందిస్తామన్నారు.
భూ పటాలను ప్రక్షాళన చేయాలన్నారు. పక్కగా భూ రీసర్వే చేసి హద్దులను నిర్ణయించేందు కే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. అనంతరం టేక్మాల్ మండలంలో విలేజ్ బౌండరీ సంబంధిత తాసిల్దార్ తో కలిసి అదనపు కలెక్టర్ నగేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిహద్దు వివాదాలకు తావు లేకుండా రైతులకు మేలు చేకూరే విధంగా పటిష్ట ప్రణాళిక ద్వారా ఈ కార్యక్రమం ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడి ల్యాండ్ సర్వే కిషన్, స్థానిక తహసిల్దార్, రెవెన్యూ అధికారులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.






