నిరుపేదలకు ఆపన్న హస్తం సీఎంఆర్‌ఎఫ్
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు, జూలై 17: రెండు లక్షల 50 వేల రూపాయల విలువైన ఎల్‌ఓసి పంపిణీ పటాన్చెరు ఆపద కాలంలో మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ డివిజన్ కి చెందిన కూరపాటి రేణుక గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతుంది.
మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మంజూరైన రెండు లక్షల 50 వేల రూపాయల విలువైన ఎల్‌ఓసిని శుక్రవారం సాయంత్రం వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జిఎంఆర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎల్‌ఓసి లతోపాటు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నమని తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






