జేఎన్టీయూ ప్రొఫె సర్‌గా బీసీనే కొనసాగించాలి
- జయలక్ష్మిని తొలగించడం ప్రభుత్వ పెద్దల కుట్రే
- ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఉద్యమమే
- పీసీసీ చీఫ్‌కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి వినతి
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రధాన యూనివర్సిటీల నియామకాలలో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యా యం పాటించేలా చూడాలని, జేఎన్టీయూ యూనివర్సిటీ రిజిస్టార్‌గా ప్రొఫెసర్ జయలక్ష్మినే కొనసాగించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు బీసీసంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరా రు. శనివారం జాజుల పీసీసీని ఆయన నివాసంలో బీసీ ప్రతినిధుల బృందంతో కలిశా రు.
ఈ సందర్భంగా ప్రత్యేకించి విశ్వవిద్యాలయాలలో వైస్‌ఛాన్స్‌లర్, రిజిస్టర్, రెక్టార్, డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టుల నియామకాలలో జనాభా దామాషాప్రకారం 60శాతం పోస్టులను బీసీలకు కేటాయించాలని కోరుతూ మహేష్‌కుమార్‌గౌడ్‌కు జాజుల శ్రీనివాస్ గౌడ్ వినతిపత్రం అందజేశారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. దామాషా ప్రకారం అన్ని రంగాల్లో వాటా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అది అమలుకు నోచుకోవడం లేదన్నారు.
బీసీలను కారణాలు లేకుండా తొలగించాలని కుట్ర చేస్తు న్నారన్నారు. రిజిస్ట్రార్‌గా బాధ్యతలు తీసుకున్న కేవలం 45 రోజుల్లోనే జెన్టీయూ ప్రొఫెసర్‌ను తొలగించడం ప్రభు త్వ పెద్దల్లోని కొందరి కుట్రేనన్నారు. ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
బీసీలను అవమానించి, ఆత్మగౌరవా న్ని దెబ్బ తీస్తే బీసీల హక్కులను కాలరాస్తే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్, బీసీనేతలు పాండు, ఇంద్రమ్ రజక, గోరిగంటి రమేష్, రాజు పాల్గొన్నారు.






