మలబార్ గోల్డ్ ప్రచారకర్తగా ఎంఎస్ ధోనీ
పంజాగుట్ట,ఆగస్టు 1(విజయక్రాంతి): ప్ర ముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్ అం డ్ డైమండ్స్ తమ ప్రచారకర్తగా ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీని నియమించినట్లు ప్రక టించింది.ఈ విషయమై సంస్థ చైర్మన్ ఎం. పి.అహమ్మద్ మాట్లాడుతూ ది రెస్పాన్సిబు ల్ జ్యువెలర్ అనేది తమ బ్రాండ్ గుర్తింపు అ న్నారు.దేశంలో అత్యంత గౌరవనీయమైన క్రీ డా ప్రముఖుల్లో ఒకరైన ఎంఎస్ ధోనీ ఒకర ని అన్నారు.అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత జట్టును ఐసీసీ నిర్వహించే మూడు వైట్-బాల్ టోర్నమెంట్లలోనూ విజేతగా నిలిపిన ఏకైక కెప్టెన్ అని కొనియాడారు.
నిజా యితీ, స్థిరత్వం,వినయానికి ప్రతీకని కొనియాడారు.గత 33 సంవత్సరాలుగా మలబా ర్ గోల్ అండ్ డైమండ్స్ను నిర్వచిస్తున్న విలువలకు ప్రతిరూపంగా నిలుస్తున్నారని తెలి పారు. నేటి వినియోగదారులు తాము ఎం చుకునే బ్రాండ్ల నుంచి కేవలం అత్యుత్తమ ఉత్పత్తులను మాత్రమే కాదు, ప్రతి కొనుగోలులోనూ పారదర్శకత, ప్రామాణికత, విశ్వా సాన్ని కూడా ఆశిస్తున్నారననారు . నైతిక వ్యా పార విధానాలు, నాణ్యత విషయంలో రాజీ లేని ప్రమాణాలు తమ సంస్థ పాటిస్తోందన్నారు.
వినియోగదారుల అంచనాలను నెర వేర్చడం ఆభరణాల పరిశ్రమ బాధ్యత అని తాము విశ్వసిస్తామన్నారు.అదే నమ్మకం గత 33 సంవత్సరాలుగా మలబార్ గోల్ అండ్ డైమండ్స్కు మార్గదర్శకంగా నిలిచిందని స్పష్టం చేశారు.ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ విశ్వాసం అనేది మాటలతో కాదు చేతలతో సంపాదించాల్సిదేనని అన్నారు.మలబార్ గోల్ అండ్ డైమండ్స్ అందుకు నిలువెత్తు నిదర్శమని చెప్పారు.అందుకే సంస్థతో తన భాగస్వామ్యం ఎంతో ప్రత్యేకమైందని తెలిపారు.






