12 March, 2026 | 9:50 AM

మహిళా సంక్షేమానికి పెద్ద పీట

12-03-2026 12:56 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, మార్చి 11 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను  కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తుందని  ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బుధవారం గంగాధర మండలంలోని కొండన్న ప ల్లి, హిమ్మత్ నగర్, చిన్నాచంపల్లి, ఉప్పరమల్యాల, గోపాలరావుపల్లి, ఇస్లాంపూర్, వెంకటాయపల్లి, కొండాయపల్లి, చర్లపల్లి(ఆర్), ర్యాలపల్లి, లింగంపల్లి గ్రామాల్లో ఒక కోటి పది లక్షల రూ పాయలతో  నిర్మిస్తున్న మహిళా సంఘ భవనాల నిర్మాణానికి  శంకుస్థాపన చేసి పనులను ప్రా రంభించారు.

ఇస్లాంపూర్ లో  ఎల్లమ్మ దేవాలయం ప్రహరీ గోడ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ప్రభుత్వ పథకాలన్నీ మహిళలే కేంద్రంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ప్రగతి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దామ్ రాము, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, సర్పంచ్లు సంఘం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్,రెండ్ల శ్రీనివాస్,బిర్ల ఆనందం,గుడి రజిని ప్రవీణ్,బారజు ప్రభాకర్ రెడ్డి,బాసవేణి శ్రీనివాస్, అరె తెజ శ్రీ రాజశేఖర్, దాసరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.