భక్తిశ్రద్ధలతో రంజాన్‌ను జరుపుకోవాలి
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, మార్చి 11(విజయక్రాంతి): ముస్లిం సోదరులు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేర కు బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ, భోలక్ పూర్, ముషీ రాబాద్ డివిజన్లోని ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈద్ ముబారక్ ఈద్ ఖా తోఫా గిఫ్టులను మాజీ కార్పొరేటర్ వాజిద్ హుస్సేన్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అరవింద్ కుమార్ యాదవ్‌లతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కవాడీ గూడ, ముషీరాబాద్ డివిజన్ల అధ్యక్షులు వల్లాల శ్యామ్ యాదవ్, కొండా శ్రీధర్ రెడ్డి, ఆర్. రాజేష్, శ్రీహరి, విక్కీ, మంజుల, మహమ్మద్ అలీ ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
అంబర్‌పేటలో...
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా అంబర్పేట నియోజకవర్గం పరిధిలోని అం బర్పేట డివిజన్ ఎంసీహెచ్ కాలనీలో రంజా న్ తోఫా పాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటే ష్ హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబోలు నరసింహారెడ్డి, రంగు సతీష్ గౌడ్, మహమ్మద్ రఫీక్, యూసుఫ్ బాబా, మల్లికార్జున్ యాదవ్, మహేష్ ముదిరాజ్, కన్నం జాకీ బాబు, మసీదు కమిటీ పెద్దలు నహీం అహ్మద్ తదితరులున్నారు.




