15 June, 2026 | 3:03 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

రెప్పపాటు విలాసం

18-11-2024 12:00 AM

నేలపై కూర్చొని, పడుకునే వారికి

సోఫాలు, స్ప్రింగ్ పరుపులు విలాసమే

కారం, పచ్చడి మెతుకులతో కడుపు నింపుకునే వారికి

కూరలు, సాంబార్, పెరుగన్నం అద్భుతమే

పంచభక్ష పరమాన్నాలు ఊహకందని విలాసమే

ప్రతిభను గుర్తించిన పని, పదవి లభిస్తే

రెప్పపాటు విలాసం కాకుండా కాపాడుకుంటారు కష్టపడి

రెప్పపాటు విలాసం గతి తప్పితే

ఘోర ప్రమాదం విషాదంగా మారొచ్చు జీవితం

రెప్పపాటు విలాసమే కొందరికి జ్ఞాపకం జీవితాంతం

ఆశాజీవులై తపన పడే వారికి అందితే పండుగే

శ్రమను మరిచి, చెమట కార్చని జీవితం

సున్నితమైతది, నెలవైతది రోగాలకు

చినుకంత విలాసం ఎక్కడి నుంచైనా రాలితే

అందితే ఆనందం, అందకపోతే విషాదం

బూడిదలో పడిన పన్నీరుగా మారొచ్చు

బురదగుంటలో పడి చితికిపోవచ్చు

విలాసాల పాలకుల ఒడిలో వాలితే

విలువ చెత్తకుండీతో సమానం కావచ్చు

చేరాల్సిన చోట చేరితే చినుకు మారుతది ముత్యంగా

రెప్పపాటు విలాసం కోసం

మద్యాన్ని, మత్తును ఆశ్రయిస్తే

పువ్వుల్ని, పూబాలల్ని నలిపేస్తే

అహింస గృహద్వారాలను ధ్వంసం చేస్తే

ప్రేమగా వచ్చిన స్నేహాన్ని చిదిమేస్తే

ఆనందం తాత్కాలికమే, చివరకు అధోగతే.