18 July, 2026 | 6:45 AM

పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

26-10-2024 06:09 PM

ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో శనివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా రక్తదాన శిబిరం స్థానిక అయిత పంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్బంగా ఇల్లందు డీఎస్పీ చంద్రభాను మాట్లాడుతూ అన్ని దానాల్లో రక్తదానం మంచిదన్నారు. ఆరోగ్యాంగా ఉండాలంటే రక్త మార్పిడి జరగాలన్నారు. వాగుల్లో ఊట నీరులా రక్తం తయారైతే ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఇల్లందు సబ్ డివిజన్ పోలీసు అధికారులు, సిబ్బంది, పట్టణంలోని యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఇల్లందు, టేకులపల్లి సిఐలు బత్తుల సత్యనారాయణ, తాటిపాముల సురేష్, ఇల్లందు, టేకులపల్లి, ఆళ్ళపల్లి, గుండాల, కొమరారం పోలీసులు పాల్గొన్నారు.