calender_icon.png 3 February, 2026 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం

03-02-2026 12:59:51 AM

మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 2: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 20 (10 ప్రభుత్వ, 10 ప్రైవేటు) కళాశాలల్లో రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించారు. మొదటి విడత ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన పరీక్షలకు 1279 (జనరల్ 604, ఒకేషనల్ 675) మంది విద్యార్థులకు 1161 (జనరల్ 589, ఒకేషనల్ 572) మంది హాజరు కాగా 118 (జనరల్ 15, ఒకేషనల్ 118) మంది గైర్హాజరయ్యారని, రెండవ విడత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ప్రాక్టికల్ పరీక్షలకు 1099 (జనరల్ 537, ఒకేషనల్ 562) మంది విద్యార్థులకు 1047 (జనరల్ 516, ఒకేషనల్ 531) మంది హాజరు కాగా 52 (జనరల్ 21, ఒకేషనల్ 31) మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, పరీక్షల కన్వీనర్ అంజయ్య వెల్లడించారు. పరీక్షా కేంద్రాలను డీఐఈఓ తనిఖీ చేశారు.