29-07-2024 01:04:46 AM
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): గ్రామ పరిపాలనలో కీలకమైన పంచాయితీరాజ్‌శాఖపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుం ది. వానకాలం సీజన్‌లో గ్రామాల్లో వ్యాధు లు ప్రబలకుండా కీలక పాత్ర పోషించాల్సిన ఆ శాఖకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు స్వల్పంగా ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికులకు సైతం వేతనాలు సరిగా అందడం లేదు. నిన్నా మొన్నటి వరకు సర్పంచ్‌లు ఏదోవిధంగా ఇబ్బందులు లేకుండా చూశారు.
సర్పంచుల పదవీకాలం ముగియడంతో కార్యదర్శుల పాలన మొదలైంది. ప్రత్యేకాధికారులు కూడా ఏదో ఓ రకంగా నెట్టుకొ స్తూనే ఉన్నారు. ౨౦౨౪ బడ్జెట్‌లో తమ శాఖకు అత్యధిక నిధులు విడుదల అవుతాయని ఎదురు చూసిన వారికి నిరాశే ఎదు రైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.29,816 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ కంటే రూ.1600 కోట్లు తక్కువగా ప్రతిపాదించడం గమనార్హం.
పింఛన్ల పెంపునకు నిధుల కొరత
ఎన్నికల మ్యానిఫెస్టోలో అన్ని రకాల పింఛన్లను రెండు వేలు పెంచి ఇస్తామని కాంగ్రెస్ పేర్కొంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో అందు కు సంబందించిన నిధులను కేటాయించలేదు. దీంతో 10 లక్షల మంది కొత్త పింఛన్ దారులకు ఎదురు చూపే మిగిలింది. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కనీసం ఆ పథకానికి కూడా ఎలాంటి కేటాయింపులు జరగలేదు. వడ్డీలేని రుణాలకు రూ.1,302 కోట్లు మాత్రమే కేటాయించారు.
రాష్ట్రంలో 64 లక్షలకు పైగా ఉన్న స్వయం సహాయ గ్రూపులకు ఇది ఏ మాత్రం సరిపోదు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పంచాయితీరాజ్‌శాఖకు గత 10 నెలల నుంచి సుమారు రూ.౨ వేలకు కోట్ల పైగా నిధులు విడుదల కావాల్సింది. ఇంతవరకు వాటిని విడుదల చేయకపోవడం, ఈ బడ్జెట్‌లో పంచాయతీరాజ్ శాఖ కేటాయించి రూ.29,816 కోట్లు ఏ మూలకు సరిపోయేలా లేదు. ఈ మొత్తం కూడా పంచాయతీల నిర్వహణకు తీసుకొచ్చిన అప్పులు, కాంట్రాక్టర్ల బిల్లులకే పరిపోయే పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే పంచాయతీరాజ్‌శాఖ శాఖ నిర్వహణ మరింత కష్టంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గత రెండేళ్లుగా పంచాయితీరాజ్ శాఖకు
నిధులు కేటాయింపు వివరాలు
2022-23 రూ.21,887 కోట్లు
2023-24 రూ.30,976 కోట్లు
2024-25 రూ. 29,816 కోట్లు