డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు
నాగర్ కర్నూల్ / వెల్దండ, జూన్ 25 (విజయక్రాంతి) ః అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లాలో పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నాగర్ కర్నూల్లో నశా ముక్త్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తీగల సునేంద్ర, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఇంచార్జి అధికారి దమయంతి తదితరులు పాల్గొని మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వెల్దండలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో సీఐ రఘువీరారెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలైతే ఆరోగ్యం, భవిష్యత్తు రెండూ నాశనమవుతాయని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జ్ఞాపకశక్తి తగ్గి ఆలోచనా శక్తి దెబ్బతింటుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మత్తు పదార్థాలు, దుర్వ్యసనాలకు దూరంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.
మాదక ద్రవ్యాలను నిరోధించాలి
చిన్నంబావి,జూన్ 25: మాదక ద్రవ్యాల ప్రజలు దూరంగా ఉండాలని స్థానిక ఎస్త్స్ర రామన్ గౌడ్ అన్నారు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించడానికి మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో గురువారం వివేకానంద పాఠశాల విద్యార్థులు,ప్రజలతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది,విద్యార్థులు,ప్రజలు పాల్గొన్నారు.






