26 June, 2026 | 2:35 AM

దివ్యాంగులకు చేయూత

26-06-2026 01:27 AM

భైంసా, జూన్ 25 (విజయక్రాంతి): భైంసా పట్టణంలో స్నేహా సొసైటీ ఫర్ రూ రల్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికలాంగుల బడి బాట-2026 ముధోల్ ఎ మ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు.  మాట్లాడుతూ, వికలాంగ పిల్లలకు విద్య, వై ద్యం మరియు పునరావాస సేవలు అందించడం, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి వారికి అవసరమైన సహాయ పరికరాలు, విద్యా అవకాశాలు కల్పించేందుకు ఇటువంటి శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించి విద్యావంతులను చేయాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హతకు టుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమోళ్ళ దత్తు గారు, మండల విద్యాధికారి, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రత్యేక పాఠశాల నిర్వాహకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.