ఆర్డర్ పెట్టిన ఆరేళ్లకు ఫిప్‌కార్ట్ నుంచి కాల్
ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌కు వింత అనుభవం
సోషల్ మీడియాలో ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ, జూన్ 27 : ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌కు వింత అనుభవం ఎదురైంది. ముంబైకి చెందిన అహ్సన్ ఖర్బాయి 2018 మే 16న ఫ్లిప్‌కార్ట్‌లో 486 రూపాయల చెప్పులను ఆర్టర్ పెట్టాడు. మూడు రోజుల తర్వాత షిప్పింగ్‌కు బయలుదేరినట్లు.. మరుసటి రోజు డెలివరీ కానున్నట్లు వెబ్‌సైట్‌లో చూపించింది. అయినప్పటికీ, సదరు కస్టమర్ ఇప్పటివరకు డెలివరీ పొందలేదు. ప్రతిరోజూ ‘అరైవింగ్ టుడే’ అని మాత్రం కనిపించేది. ఇలా ఆరేళ్ళు గడిచిపోయింది. ఆర్డర్ పెట్టిన ఆరేళ్లకు అహ్సన్ ఖర్బాయికి కస్టమర్ సపోర్ట్ నుంచి కాల్ వచ్చింది. కస్టమర్ కేర్ ప్రతినిధి.. సమస్య ఏంటని ఉల్టా అతన్నే ప్రశ్నించింది. దీంతో, తనకు ఎదురైన ఛేదు అనుభవాన్ని యూజర్ తన ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. దీనిపై ఫ్లిప్‌కార్ట్ రిప్లు ఇస్తూ.. మీకు ఎదురైన అనుభవానికి క్షమించండి.. ఇన్ని రోజులు ఎదురు చూడటం గొప్ప విషయం అని పేర్కొంది.






