13 July, 2026 | 11:32 AM

యెడ్డీపై చార్జ్‌షీట్

28-06-2024 01:13 AM

లైంగిక వేధింపుల కేసులో దాఖలు

బెంగళూరు, జూన్ 27: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు యెడియూరప్పపై ఆ రాష్ట్ర సీఐడీ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఓ గిరిజన బాలికను తన ఇంట్లో లైంగికంగా వేధించారని ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ చట్టంలోని సెక్షన్ 8 (లైంగిక నేరాలను నుంచి బాలలకు రక్షణ) కింద సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేయటానికి ప్రయత్నించగా కర్ణాటక హైకోర్టు ఇటీవల ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ట్రయల్ కోర్టులో గురువారం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 354ఏ, 204, 214 కింద కూడా కేసు నమోదైంది.