17 March, 2026 | 2:58 PM

మెక్‌స్వీనికి పిలుపు

11-11-2024 12:01 AM

బీజీటీ తొలి టెస్టుకు ఆసీస్ జట్టు ప్రకటన

సిడ్నీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆ స్ట్రేలియా 13 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో అనేక మంది స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కింది. సీనియర్ ప్లేయ ర్ ఉస్మాన్ ఖవాజాతో కలిసి మెక్‌స్వీనీ ఇ న్నింగ్స్ ఓపెన్ చేయనున్నాడు. అంతే కాకుం డా నిలకడగా రాణిస్తున్న జోష్ ఇంగ్లిస్‌కు కూడా చోటు దక్కింది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఈ సిరీస్ ఆరంభం కానుంది. 

ఆసీస్ జట్టు: కమిన్స్ (కెప్టెన్), బోలాండ్, కేరీ, హేజిల్‌వుడ్, హెడ్, ఇంగ్లిస్, ఖవాజా, లబుషేన్, లయన్, మార్ష్, మెక్‌స్వీనీ, స్మిత్, స్టార్క్.