calender_icon.png 3 February, 2026 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకునే ఫ్రెష్ లవ్‌స్టోరీ

03-02-2026 01:38:28 AM

సంతోష్ శోభన్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ‘. ఈ చిత్రాన్ని  యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తోంది. అశ్విన్‌చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మ్యూజికల్ రొమాంటిక్ లవ్‌స్టోరీ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న ఉభయ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని తెలంగాణ, ఏపీల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో హీరో సంతోష్ శోభన్ మాట్లా డుతూ.. “నేను చిన్న గ్యాప్ తీసుకున్న మాట నిజమే. ఈసారి నేను చూపించబోయే కథ ఇరవై ఏళ్ల పాటు మీకు గుర్తుండిపోవాలి అనుకుని ఈ సినిమా చేశాను. ‘కపుల్ ఫ్రెండ్లీ‘ ఒక జెన్యూన్ ఇంటెన్షన్‌తో, హానెస్ట్‌గా చేసిన సినిమా. ఇది నా కెరీర్‌లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది” అన్నారు. హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో బ్యూటిఫుల్ క్యారెక్టర్‌లో నటించే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. మిత్ర క్యారెక్టర్‌తో నేను పర్సనల్‌గా బాగా కనెక్ట్ అయ్యా. ఈ పాత్ర కూడా నాలాగే లైఫ్‌లో ఏదైనా చేయాల్సివస్తే ముందు యాక్షన్‌లోకి దిగేస్తుంది. ‘కపుల్ ఫ్రెండ్లీ‘ సినిమా కపుల్స్ కోసమే కాదు సింగిల్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం వస్తోంది” అని తెలిపింది.

డైరెక్టర్ అశ్విన్‌చంద్రశేఖర్ మాట్లా డుతూ.. “ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక హానెస్ట్ అటెంప్ట్ చేశారు అనే ఫీల్ అందరిలో తప్పకుండా కలుగుతుంది. నేను ఈ కథ రాసినప్పుడు శివ, మిత్రతోపాటు కథ జరిగే చెన్నై నగరాన్ని కూడా ఒక పాత్రలా అనుకున్నా” అని చెప్పారు. ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. “ఇంటర్వెల్ వరకు చూసేప్పటికే ఈ సినిమా మనసుకు హత్తుకుంది. ఈ సినిమా చూసిన ఫీల్‌లో చాలా రోజులు ఉండిపోయాను. మనం ఎన్నో ప్రేమకథలు చూస్తుంటాం. ఇదొక డిఫరెంట్ లవ్‌స్టోరీ. ఇలాంటి కొత్త తరహా ప్రేమకథలు రావాలి. ఇది బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఈ సినిమా తర్వాత సంతోష్ శోభన్ స్టార్ అవుతారు” అన్నారు. ‘ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తుంద’ని సహ నిర్మాత అజయ్‌కుమార్ రాజు తెలిపారు.