calender_icon.png 3 February, 2026 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ చిత్రంలో సాయిపల్లవి కూడా..

03-02-2026 01:40:28 AM

తమిళ స్టార్ ధనుష్ వరుస సినిమాలతో దూసుకువెళ్తున్నారు. మంచి కాన్సెప్ట్‌తో ఎప్పుడూ ప్రేక్షకులను అలరించే ఆయన ప్రస్తుతం రాజ్‌కుమార్ పెరియా సామి దర్శకత్వంలో ఓ కొత్త సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదు.  ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ‘డీ55’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందీ సినిమా. ‘అమరన్’తో సక్సెస్ అందుకున్న డైరెక్టర్ రాజ్‌కుమార్.. ధనుష్ కోసం అద్భుతమైన కథ సిద్ధం చేశాడట.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ అని ఇప్పటికే టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసిందీ చిత్రంబృందం. ఇక ఇందులో మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో అలరించనున్నారని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉన్నట్లు తాజాగా టీమ్ ప్రకటించింది. సాయిపల్లవిని కూడా ఈ ప్రాజెక్టులో భాగం చేసినట్టు వెల్లడించారు. అంటే, ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారన్న మాట.

అయితే, ఇందులో సాయిపల్లవి పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఆమెను ఈ చిత్రంలో ప్రేక్షకులు గతంలో ఎన్నడూలేని పాత్రలో చూస్తారట. అందుకే సాయిపల్లవిని ఆ పాత్ర కోసం మాత్రమే దర్శకుడు రాజ్‌కుమార్ తీసుకున్నారట. అయితే, ఇందులో మెయిన్ హీరోయిన్ సాయిపల్లవి ఉంటుందా? లేక శ్రీలీలనా..? అనేది తెలియాల్సి ఉంది. ఉండర్ బార్ ఫిల్మ్స్ ఆర్ టేక్ స్టూడియోస్ రూపొందిస్తున్న ఈ సినిమాకు సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.