10 May, 2026 | 2:46 AM

గేర్ మార్చిన కారు!

10-05-2026 01:35 AM
  1. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్  యాక్టివ్
  2. ఉద్యమ బాటలో ముందుకు 
  3. రైతు సమస్యలు, పంటల కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం
  4. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టే ప్రయత్నం
  5. గ్రౌండ్‌లోకి కేటీఆర్, హరీష్‌రావు 
  6. క్షేత్రస్థాయిలో కార్యకలాపాలపై కేసీఆర్ వ్యూహాత్మక పాత్ర

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి) : తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ తన ఆధిపత్యాన్ని చాటుకునే దిశగా భారతీయ రాష్ట్ర సమితి క్రమంగా పంథా మార్చుతోంది. 20 23 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కొంతకాలం ఆత్మరక్షణ ధోరణిలో కనిపించిన బీఆ ర్‌ఎస్.. ఇప్పుడు పూర్తిస్థాయి ఉద్యమ రాజకీయాలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా రైతు ల సమస్యలు, పంటల కొనుగోళ్లు, సాగునీటి ఇబ్బందులు, రైతు రుణమాఫీ, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలను కేంద్రబిందువుగా చేసుకుని అధికార కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచాలని గులాబీ పార్టీ వ్యూహరచన చేస్తోంది.

ఈ వ్యూహంలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నా రు. రైతు భేటీలు, కలెక్టరేట్ల ముట్టడి, ధర్నా లు, ఆందోళనల ద్వారా కేడర్‌ను మళ్లీ యా క్టివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలపై పోరాడే పార్టీగా బీఆర్‌ఎస్‌ను మళ్లీ ప్రజల్లో నిలబెట్టే లక్ష్యంగా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయా ల్లో రైతు వర్గం ఎప్పుడూ కీలక ఓటు బ్యాం కుగా నిలుస్తుంది.

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యు త్, సాగునీటి ప్రాజెక్టులు వంటి పథకాలతో గ్రామ స్థాయిలో బలమైన మద్దతు సంపాదించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా కారణాలతో రైతులకు, పార్టీకి కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అదే రైతు వర్గాన్ని తిరిగి ఆకర్షించడమే బీఆర్‌ఎస్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

ముఖ్యంగా వరి కొనుగోళ్లలో ఆలస్యం, రైతులకు చెల్లింపుల జాప్యం, పంటలకు కనీస మద్దతు ధర సమస్య, ఎరువుల కొరత, సాగునీటి అనిశ్చితి వంటి అంశాలపై రైతుల్లో అసంతృప్తి పెరుగుతోందని బీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల హామీలకు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు మ ధ్య వ్యత్యాసాన్ని హైలైట్ చేస్తూ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. 

ఉద్యమాలతోనే పార్టీ పునరుద్ధరణ

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ కేడర్‌లో కొంత నిస్తేజం నెలకొం ది. పలుచోట్ల నాయకత్వం సైలెంట్ కావడం, కొంతమంది నేతలు పార్టీ మారడం, స్థానిక స్థాయిలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ టం వంటి పరిణామాలు పార్టీపై ప్రభావం చూపించాయి. ఈ పరిస్థితుల్లో కేడర్‌కు మళ్లీ దిశానిర్దేశం చేయాలంటే ఉ ద్యమాలే మార్గమని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలు స్తోంది. అందుకే ఇప్పుడు జిల్లా కేంద్రాలు, మండల స్థాయిల్లో నిరసనలు, ధర్నాలు, రైతు దీక్షలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, గ్రామసభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ప్రతి నియోజకవర్గంలో స్థానిక సమస్యలను గుర్తించి వాటిపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కార్యాచరణలో కేటీఆర్, హ రీష్‌రావు కీలక పాత్ర పోషిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైతు అంశాలపై మాట్లాడే సామర్థ్యం, గ్రామీణ స్థాయిలో ఉన్న అనుబంధం, ఉద్యమ రాజకీయాల్లో అ నుభవం వారికి బలంగా మారుతున్నాయి. మరోవైపు యువత, సోషల్ మీడియా, పట్ట ణ వర్గాలపై ఫోకస్ చేస్తూ పార్టీకి కొత్త ఎనర్జీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రజ ల్లో పెరుగుతున్న ప్రశ్నలను బీఆర్‌ఎస్ రాజకీయ అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, మహిళా హామీ లు, ఉచిత పథకాల అమలులో జాప్యాన్ని హైలైట్ చేస్తోంది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎందుకు అమలు కావడం లేదు?, రైతులకు డబ్బులు ఎందు కు అందడం లేదు?, పంట కొనుగోళ్లు ఎందుకు సక్రమంగా జరగడం లేదు? వంటి అంశాలతో ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలో ప్రజల్లో అసంతృప్తిని రాజకీయ మద్దతుగా మార్చుకోవడమే బీఆర్‌ఎస్ అసలు వ్యూహంగా కనిపిస్తోంది. 

కేసీఆర్ పాత్రపై ఆసక్తి

ప్రస్తుతం పార్టీ కార్యకలాపాల్లో కేటీఆర్, హరీష్‌రావు క్రియాశీలకంగా వ్యవహరిస్తుండగా పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అవసరమైన సందర్భాల్లోనే ఆయన ప్రజల్లోకి రావడం, మిగతా సమయంలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ముం దుకు తీసుకురావడం ద్వారా పార్టీని పునర్వ్యవస్థీకరించే ప్రయత్నం జరుగుతోందని అం టున్నారు.

అయితే భవిష్యత్‌లో పెద్ద ఎత్తున ఉద్యమాలు లేదా రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలకు కేసీఆర్ స్వయంగా నాయకత్వం వహిస్తే పార్టీ కేడర్‌లో మరింత ఉత్సాహం వచ్చే అవకాశముందని బీఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తు న్నాయి. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అధికార పార్టీకి ధీటుగా ఫలితాలు పొందగలిగింది. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా బీఆర్‌ఎస్ అత్యంత కీలకంగా చూస్తోంది.

గ్రామస్థాయిలో పార్టీ బలాన్ని మరింత పెంచుకోవడా నికి ఈ  ఎన్నికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని యోచిస్తున్నది. అందు కే ఇప్పటి నుంచే గ్రామీణ సమస్యలపై ఫోక స్ పెంచి ప్రజల్లో తిరిగి బలమైన పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం బీఆర్‌ఎస్ వ్యూహం కేవలం విమర్శల రాజకీ యాలకు పరిమితం కావడం లేదు. ప్రజా సమస్యలను ఉద్యమాలుగా మార్చి, ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడిలో పెంచుతూ భవి ష్యత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యం గా ప్రజల్లోకి బలంగా వెళ్లే విధంగా కార్యాచరణను అవలంభిస్తున్నది.