బీజేపీ యువమోర్చా నేతలకు గృహ నిర్బంధం
నాగల్‌గిద్ద, ఆగస్టు 15 (విజయ క్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు బయలుదేరిన నాగల్‌గిద్ద మండల బీజేపీ నాయకులను(BJP Yuva Morcha leaders ) నాగల్‌గిద్ద ఏఎస్ఐ రవీందర్ గృహ నిర్బంధం చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడు రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోల చొప్పున అందిస్తున్న బియ్యం పథకంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో పెట్టకుండా, కేవలం ఒక కిలో బియ్యం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తన ఫొటో పెట్టుకోవడం దారుణమన్నారు. ఒక కిలో బియ్యం మాత్రమే ఇచ్చి మొత్తం బియ్యం ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రాజశేఖర్, సీనియర్ నాయకులు నాగశెట్టి పాటిల్, రాజు స్వామి, శివరాజ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.






