అమరుల త్యాగ ఫలితమే స్వేచ్ఛా స్వాతంత్య్రం
15-08-2026 09:56 AM
నాగర్ కర్నూల్, ఆగస్టు 15 (విజయక్రాంతి): దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడుతూ అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులందరికీ చేరేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.






