calender_icon.png 11 August, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరెడ్డిపై కేసు నమోదు

21-07-2024 12:34:43 AM

వివాదాస్పద నటిగా పేరు పొందిన శ్రీరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకేంద్రంలో ఉన్న పట్టణ మూడోటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పలు సినిమాల్లో నటించిన శ్రీరెడ్డి యూట్యూబర్ కూడా. ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ యూట్యూబ్‌లో వీడియోలు వదులుతుంది. అలా ఇటీవలి ఎన్నికలకు ముందు కూడా పలువురు రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యలు 

వివాదాస్పదమయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలుకు చెందిన టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై స్థానిక పోలీసులు స్పందించి, శ్రీరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.