28 August, 2026 | 8:04 PM

Breaking News

సీఎంకు రాఖీ కట్టిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్   •   విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం   •   ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిద్దాం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి   •   డ్రై ఫ్రూట్స్‌తో రాఖీలు తయారు చేసిన చిన్నారి   •   ఏఐవైఎఫ్ మానుకోట జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు   •   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి   •   రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •   రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన గురుకుల డిగ్రీ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారిణిలు   •  

నేషనల్ క్రష్

21-07-2024 12:32 AM

బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి నటించిన తాజా చిత్రం ‘బ్యాడ్‌న్యూజ్’ ఇటీవలే విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా కూడగట్టుకుంటోందీ మూవీ. ఇదిలా ఉంటే, త్రిప్తి తాజాగా అభిమానుల గుండెల్లో ‘నేషనల్ క్రష్’గా స్థానం దక్కించుకుంది. ‘యానిమల్’తో ఒక్కసారిగా ఫేమ్ సొంతం చేసుకున్న ఈ అందాల భామకు ఆ సినిమా తర్వాత యూత్‌లో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అభిమానులు తనను ‘నేషనల్ క్రష్’ అంటూ ట్యాగ్ చేయటంపై త్రిప్తి స్పందించింది. ఆ ట్యాగ్ విషయంలో తాను ఆనందంగా ఉన్నట్టు తెలిపింది. “బాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టి సుమారు ఏడేళ్లయినందుకు సంతోషంగా ఉన్నా.

గొప్ప నటీనటులు, దర్శకులతో కలిసి పని చేసే అవకాశం వస్తుందని కెరీర్ ఆరంభంలో ఎప్పుడూ అనుకోలేదు.. నేను యాక్టింగ్‌ను సీరియస్‌గా తీసుకోకపోవటమే ఇందుకు కారణం. ఫస్ట్ మూవీ తర్వాత కెరీర్‌ను విధికే వదిలేశా. ‘ఒక సినిమా చేశా కదా.. అదృష్టం ఉంటే రెండో సినిమా అదే వస్తుంది’ అనుకున్నా. అలా అనుకుంటూనే ‘లైలామజ్ను’ ఆడిషన్స్‌లో పాల్గొన్నా.. అప్పట్నుంచే నటనపై దృష్టిపెట్టా.. శిక్షణ కూడా తీసుకున్నా. ఇప్పుడు ప్రేక్షకులు నా నటనతో మమేకం అవుతున్నారు” అని తెలిపిందీ అమ్మడు.

ఇంకా ఈ సొగసరి క్రష్ ట్యాగ్‌పై స్పందిస్తూ.. “నేషనల్ క్రష్’ అనేది ట్యాగ్ మాత్రమే కాదు.. నా దృష్టిలో అది అభిమానులు చూపిస్తున్న ప్రేమ! వాళ్లలా పిలుస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ పిలుపు నా బాధ్యతను పెంచింది కూడా. ప్రేక్షకులను అలరించే చిత్రాల్లో నటించాలని ఉంది” అని చెప్పు కొచ్చింది త్రిప్తి డిమ్రి.