పదేళ్లకే సెంచరీ
14-06-2026 12:37 AM
వైభవ్ సోదరుడి విధ్వంసం
పాట్నా, జూన్ 13 : భారత క్రికెట్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తరహాలోనే అతని తమ్ముడు కూడా రెచ్చిపోతున్నాడు. వైభవ్ సోదరుడు ఆశీర్వాద్ బ్యాట్‌తో చెలరేగిపోతున్నాడు.ఓ లోకల్ మ్యాచ్‌లో సెంచరీ బాదేశాడు. పదేళ్ల ఆశీర్వాద్ 87 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్స ర్‌తో సెంచరీ సాధించాడు.తమ్ముడి సెంచరీపై వైభవ్ సో షల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్పాడు.
ఈ పోస్టుకు చిన్ననాటి ఫోటోను కూడా జత చేశాడు. ప్రస్తుతం ఆశీర్వాద్ మ్యాచ్ స్కోరు కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైభవ్ ఫ్యామిలీలో మరో చిచ్చర పిడుగు దూసుకొచ్చేస్తున్నాడంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ ఓపెనర్లుగా దిగితే ఇక బౌలర్లకు చు క్కలే అంటూ కితాబిస్తున్నారు.






