14 June, 2026 | 1:46 AM

సెమీస్‌లో సింధు ఓటమి

14-06-2026 12:35 AM

సిడ్నీ, జూన్ 13 : ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 టైటిల్ గెలవాలనుకున్న తెలుగుతేజం పీవీ సింధుకు నిరాశే మిగిలింది. ఈ టోర్నీ సెమీఫైనల్లో టాప్ సీడ్ య మగుచి (జపాన్) చేతిలో సింధు ఓటమిపాలైంది. ప్రస్తు త ప్రపంచ ఛాంపియన్ అయిన మయగుచి చేతిలో 22- 21 తేడాతో ఓడిపోయింది.

తొలి గేమ్‌లో చాలాసేపు సింధు ఆధిక్యంలో నిలిచినా దానిని నిలబెట్టుకోలేకపోయింది. ఆరంభంలో వెనుకబడినప్పటకీ ఒత్తిడి కి గురి కాకుండా యమగుచి పట్టువదలకుండా పోరాడింది.దూకుడుగా ఆడిన యమగుచి రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది.సింధు ఓటమితో ఈ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది.