4 March, 2026 | 1:36 AM

రంగుల కేళి.. ఆనంద హోలీ

04-03-2026 12:00 AM
  1. ఉమ్మడి జిల్లాలో అంబరాన్ని తాకిన హోలీ సంబురాలు
  2. ఉత్సాహంగా పాల్గొన్న ఎస్పీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు
  3. రంగులు చల్లుతూ నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్న నేతలు

ఆదిలాబాద్/నిర్మల్/భైంసా/ఖానాపూర్/కుబీర్/కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి ౩ (విజయక్రాంతి): రంగుల కేలి హోలీ పండుగ వేడుకలు జిల్లావ్యాప్తంగా ఆనందోత్సవాల మధ్య జరిగాయి. మంగళవారం ఉదయం నుండే ఆదిలాబాద్ జిల్లా కేంద్రం తో పాటు వివిధ మండలాల్లో యువతి, యువకులు, చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ పండుగను జరుపుకున్నారు.

యువకులు కేరింతలు కొడుతూ, డిజె సౌండ్ సిస్టం అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ప్రజా ప్రతినిధులతో పాటు ఆయా రాజకీయ పార్టీల నేతలు, జిల్లా ఉన్నతాధికారులు రంగుల్లో మునిగి తేలుతూ ఆనందోత్సవాల మధ్య నృత్యాలు చేస్తూ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ బీజేపీ పార్టీ శ్రేణులతో కలిసి ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శంకర్ ఉదయమే తమ కుటుంబ సభ్యులతో కలిసి హోలీ పండగను జరుపుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేకు పార్టీ శ్రేణులకు రంగులు పూసారు. ఈ సందర్భంగా బ్యాండ్ మేళాలకు అనుగుణంగా పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే నృత్యాలు చేస్తూ అందరినీ ఉత్సాహ పరిచారు. అదేవిదంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సైతం హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జరిగిన హోలీ వేడుకల్లో ఎస్పీ తో పాటు ఏఎస్పీ మౌనిక, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్, డీఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పోలీస్ లతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు.

పలువురు పోలీసులు ఎస్పీకి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు. పలువురు పోలీసులు జిల్లా ఎస్పీని భుజాలపై ఎత్తుకొని చేస్తూ ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ, పండగ వేడుకలను జరుపుకున్నారు.  అటు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న సైతం హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఊరి వేడుకల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి జోగు రామన్న కు రంగులు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు ఆదిలాబాద్ మున్సిపల్  చైర్పర్సన్ బండారి అనూష సతీష్ హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. భుక్తాపుర్ కాలనీ వసూలు, మహిళలతో కలిసి చైర్పర్సన్ హోలీ వేడుకల్లో పాల్గొని, ఒకరికొకరు రంగు లు చల్లుకుంటూ ఆనందోచాల మధ్య హోలీ వేడుకలు జరుపుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు సైతం ఛైర్పర్సన్‌కు రంగులు పూసి హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ జిల్లాలో మంగళవారం పోలీ సంబురాలు ఘనంగా జరిగాయి.

జిల్లా కేంద్రంతో పాటు ఖానాపూర్ బైంసా బాసర కుంటాల దిల్వార్పూర్ కడెం సారంగాపూర్ మామిడాల లక్ష్మణ చందా తదితర మండలాల్లో హోలీ సంబురాలు ఘనంగా నిర్వ హించారు. యువకులు మహిళలు చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు పూసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ అప్పల కావ్య గణేష్ చక్రవర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకు న్నారు. నిర్మల్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో పోలి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

భైంసా పట్టణంలో హిందు వాహిని ఆధ్వర్యం లో ర్యాలీ నిర్వహించగా నిర్మల్ జిల్లా కేంద్రం లో విశ్వహిందూ పరిషత్ హిందూ వాహిని ఆధ్వర్యం లో హోలీ ర్యాలీ నిర్వహించారు ఈ ఈ వేడుకలలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు టీఎన్జీవో పంచాయతీరాజ్ ఇంజనీర్లు ఎస్‌టియు టీఎస్ ఉపాధ్యాయ సంఘం పిఆర్టియు పి ఆర్ టి యు టి ఎస్ సంఘాల ఆధ్వర్యంలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

భైంసా పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల నిర్మల్ పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాల సోఫినార్ గురుకుల పాఠశాలలో హోలీ సంబరాలు జరుపుకున్నారు. హోలీ సందర్భంగా పట్టణంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు శ్రీధర్ లక్ష్మణ్ ఎస్టియు జిల్లా అధ్యక్షులు భూమున్న యాదవ్ స్థానిక నాయకులు పాల్గొన్నారు 

అలాగే.. కుబీర్, తానూర్ మండలాలు మంగళవారం హోలీ సంబరాలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆయా గ్రామాల్లో ఉదయం నుండి ఒకరిపై ఒకరు రంగులు పూసుకొని హ్యాపీ హోలీ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల్లో హోలీ ఉత్సవ ర్యాలీలను నిర్వహించారు

పండుగలతో జీవితంలో ఆనందం.. 

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం హోలీ పండుగను ఘనంగా నిర్వహిం చారు. ఎస్పీ జానకి షర్మిల ఏఎస్పీలు ఉపేందర్ రెడ్డి సాయికుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఒకరిపై ఒకరు రంగులు పూసుకొని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ జానకి షర్మిల బ్యాండ్ వంచి నృత్యాలు చేశా రు. పండుగలు ఆనందాన్ని ఇస్తాయని తెలిపారు. ఈ కార్యక్ర మంలో జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆనందోత్సవాల నడుమ రంగేళి

హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ప్రజలు మంగళవారం ఆనందోత్సవాల మధ్య ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. హోలీ వేడుకల్లో చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రజలు పరస్పరం రంగులు చల్లు కుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నా రు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా, కాలనీలలో యువత సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని సందడి చేస్తూ వేడుకలను జరుపుకున్నారు. సహజ సిద్ధ రంగు లతో పండుగను నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాల యంలో ఎస్పీ నితిక పంత్ సిబ్బందితో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. నృ త్యం చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ కుటుం బ సభ్యులతో పాటు సిబ్బందితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి తన నివాసం వద్ద వేడుకలు జరుపుకుని నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, కాగజ్నగర్లో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు కలి సి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోలీ పండుగ సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర స్నేహాన్ని పెంపొందించే పండుగగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. హోలీ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.